వీర్యదానంతో ఫ్రీగా ఐఫోన్!

Posted On:18-09-2015
No.Of Views:393

షాంఘై: యాపిల్ తాజా ఐఫోన్ ను దక్కించుకునేందకు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ ప్రియులుపోటీ పడుతున్నారు. చైనాలో ఈ పిచ్చి పీక్ స్టేజీకి చేరింది. ఐఫోన్ 6ఎస్ కోసం ఇద్దరు చైనీయులు ఏకంగా తమ కిడ్నీలను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. బేరం బెడిసి కొట్టడంతో వారు వెనక్కు తగ్గారు.షాంఘైలోని రెండు స్పెర్మ్ బ్యాంకులు మరో అడుగు ముందుకు వేసి యువతకు గాలం వేశాయి. వీర్యం దానం చేయండి.. ఐఫోన్ పట్టుకెళ్లండిఅంటూ యాపిల్ప్రియులను ఊరిస్తున్నాయి. ఇందుకోసం ఒక ప్రకటన కూడా ఇచ్చాయి. ఐఫోన్ 6 ఎస్ దక్కించుకునేందుకు కిడ్నీలు అమ్మాల్సిన పనిలేదు. జస్ట్ వీర్యం దానం చేస్తే చాలు ఐఫోన్ మీ సొంతమవుతుందని ఎడ్వర్టైజ్ మెంట్ ఇచ్చాయి. అయితే వీర్యం దానం చేయడానికి కొన్ని అర్హతలు నిర్దేశించింది. చైనా గుర్తింపు కార్డు, కాలేజీ డిగ్రీతో పాటు తప్పనిసరిగా 165 సెంటీమీటర్ల ఎత్తు కలిగివుండాలి. ఎటువంటి జన్యుపరమైన వ్యాధులు ఉండరాదు. 17 మిల్లీలీటర్ల వీర్యం దానం చేస్తే సుమారు రూ. 60 వేలు ఇస్తామని స్పెర్మ్ బ్యాంకులు ప్రకటించాయి. ఒక్కరు ఎన్నిసార్లైనా దానం చేయొచ్చు. అయితే ఒకసారి దానం చేసిన తర్వాత 48 రోజుల గ్యాప్ తీసుకోవాలని నిబంధన పెట్టింది. వీర్యం దానం చేసేందుకు ఎంతమంది ముందుకు వచ్చారనేది త్వరలోనే తెలుస్తుంది.