టెన్నిస్ గురించి తెలియని సానియా?

Posted On:22-10-2015
No.Of Views:318

కపిల్‌ను చిన్న తెరపై చూడగానే నవ్వు వచ్చేస్తుంది. ఆయన షో క్యామెడీ నైట్స్ ఆఫ్ కపిల్లో ఇక నవ్వులే నవ్వు. కొత్త ఎపిసోడ్లో కపిల్ వేసిన క్యామెడీ బంతికి టెన్నిస్    స్టార్ సానియా మిర్జా  క్లీన్బోల్డ్ అయిపోయింది. అది ఎట్లాంటారా.. సానియా మిర్జాను టెన్నిస్    స్టార్ నే ప్రపంచానికి తెలుసు. అయితే టెన్నిస్ చరిత్ర గురించి అస్సలు తెలియదు. నమ్మమంటారా అని మీరు అడగవచ్చు. నిజమండీ బాబు ఈవిషయాన్ని కపిల్ రుజువు చేశాడు. టెన్నిస్ స్టార్ కదా అని టెన్నిస్ గురించి టకా టకా ప్రశ్నలు సంధించాడు. ఒక్క దానికి సమాధానం ఇవ్వలేదు. కపిల్ ఊరు కోడు కదా ఆ వెంటనే క్రికెట్ గురించి అడిగాడు. సానియా మిర్జా టకా టకా సమాధానాలు చెప్పేసింది. టెన్నిస్ స్టార్‌కు తన ఆట గురించి ఏమీ తెలియదు. కానీ తనకు సంబంధం లేని క్రికెట్ ఆట గురించి అడిగితే సరైన సమాధానాలు చెప్పింది. తన ఆట గురించి తెలియని స్టార్లు ఎవరైనా ఉన్నారా అని కపిల్ ఆమెను నిలదీశాడు. దాంతో ఆడియెన్స్‌లో నవ్వు. సానియా ఈ విమర్శని చాలా తేలిగ్గా తీసుకుంది.