అమరావతికి కొత్త ప్రమాదం

Posted On:22-10-2015
No.Of Views:413

ఎంతో అట్టహాసంగా విజయదశమి నాడే కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. వాస్తును దృష్టిలో పెట్టుకొని బ్రహ్మముహూర్తంలో అమరావతికి శంకుస్థాపన జరిపినప్పటికీ కొత్త ప్రమాదం పొంచి ఉన్నట్లు వినిపిస్తోంది. ఎపి రాజధాని అమరావతి భూకంపాలు ఎక్కువగా వచ్చే సెస్మోక్ జోన్ `3 పరిధిలో ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జోన్ పరిధిలో ఉన్న ప్రాంతాలుకు భూకంపం తప్పనిసరిగా వస్తుందని జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ పరిశోధనా కేంద్రం(ఎన్జిఆర్ఐ)సిఎస్ఐఆర్ పరిశోధనా సంస్థ తేల్చిచెబుతోంది. దీనిపై గతంలో చర్చ జరిగినప్పటికీ ఎపి సర్కార్ బాధ్యులు ఈ సంస్థను సంప్రదించలేదని తెలుస్తోంది. సెస్మోగ్రాఫ్`3 జోన్లో ఉన్నప్రాంతాల్లో భూకంపం కనీసం రిక్టార్ స్కేల్పై 7 వచ్చే అవకాశం ఉంది. ఇదే జోన్ పరిధిలో ఉన్న ఒంగోల్లో 1960లో సంభవించిన భూకంపంలో రిక్టార్ స్కేల్పై 5.2గా నమోదైంది. సెస్మోగ్రాప్`3 పరిధిలో ఎప్పుడైనా భూకంపం సంభవించే అవకాశాున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.