మలయాళీ కన్ను టాలీవుడ్‌పై

Posted On:29-10-2015
No.Of Views:290

అలు అర్జున్‌,మహేష్‌బాబు సినిమాు కేరళలో సూపర్‌గా నడుస్తుండటంతో ఇక్కడి మార్కెట్‌పై అంచనాలు పెరిగాయి. కేరళ మార్కెట్‌ పెంచుకోవాంటే టాలీవుడ్‌ సినిమాల్లో కేరళ నటులను తీసుకునే వారు. ఈ సినిమాలు హిట్టవ్వడంతో మలయాళీలు సూపర్‌ స్టార్ల కన్ను టాలీవుడ్‌పై పడిరది. మోహన్‌లాల్‌ వంటి అగ్రనటులు తొలుగులో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే చంద్రశేఖర్‌ ఏలేటి ‘జనతా గారేజ్‌’ సినిమాలో నటించిన ఈ అగ్రనటుడు సురేష్‌ వంశీ సినిమాలో చేయడానికి అంగీకరించాడు. కొత్తగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఎన్టీయార్‌ కొరటాల కాంబినేషన్‌లో వచ్చే సినిమాలో చేసేందుకు మోహన్‌లాల్‌ ఆసక్తి కనబర్చడమే కాకుండా ఎన్టీఆర్‌తో  మాట్లాడినట్లు సమాచారం. కొరటాల శ్రీమంతుడు సినిమాలో జగపతిబాబును కీలకపాత్రలో తీర్చిదిద్దినట్లే, ఎన్టీఆర్‌ సినిమాలో ఓ మహానటుడు కావాల్సి వచ్చిందట. ఎవర్ని తీసుకుంటే బాగుంటుందని అన్వేషిస్తుండగా ఈ విషయం తెలిసిన మోహన్‌లాల్‌ తానున్నానని ఎన్టీఆర్‌కు చెప్పాడట. ఎన్టీఆర్‌ నిర్ణయాన్ని కొరటాలకు వదిలేశాడట. మోహల్‌లాల్‌ చివరికి ఇలా వేషాలను అడగాల్సి వచ్చింది మరి!