భజ్జీ..బల్లే..బల్లే

Posted On:29-10-2015
No.Of Views:275

భారత క్రికెటర్‌ భజ్జీ అలియాస్‌ హర్బజన్‌ సింగ్‌,గీతా బస్రాను పంజాబీ సాంప్రదాయంలో పెళ్లాడాడు. జలంధర్‌కు సమీపంలోని పాగ్వారా గురుద్వారాలో ఈ పెళ్లి తంతు జరిగింది. సోమవారం గోరంటాకు వేడుకలు జరిగాయి. ఆ తర్వాత రోజు కాబోయే వధూవరులు స్నేహితులతో కలిసి బల్లే..బల్లే డాన్స్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మైకాసింగ్‌, గురుద్వాస్‌ మాన్‌ పాల్గొని సెబ్రెటీలను అలరించారు. స్టార్‌ కెమెడియన్‌ గురుప్రీత్‌ ఘగ్గీ హాస్యగుళికు ఆహుతులను నవ్వించాయి. ఈ కార్యక్రమంలో సహచర క్రికెటర్లు పార్ధివ్‌ పటేల్‌, ఆర్పీసింగ్‌ చేరడంతో నవ్వులే నవ్వులు. ఆ తర్వాత బాలీవుడ్‌ స్టైల్లో కాబోయే వధూవరులు రింగు మార్చుకున్నారు. బుధవారం పంజాబీ వివాహ వేడుకల్లో భాగమైన జాగో సెర్మని జరిగింది. భజ్జీ తల్లి, సోదరి అలకరించిన ఘరా,గిద్దను తీసుకువచ్చారు. దీన్ని హల్లా గుల్లా,దోలీ అంటారు. ఆ తర్వాత భజ్జీ ఆకుపచ్చని పటానీ సూట్లో మెరిసిపోతూ కనిపంచాడు. జాగో సెర్మని తర్వాత ప్రత్యేకమైన విందు ఏర్పాటు జరిగాయి. దీంట్లో సహచర క్రికెటర్లు శరణ్‌దీప్‌ సింగ్‌, రాహూల్‌ శర్మ తదితయి పాల్గొన్నారు. ఆ తర్వాతి పెళ్లి కార్యక్రమం జలంధర్‌ సిటిలో పోష్‌ ఏరియాలో ఉన్న భజ్జీ ఇంట్లో జరిగింది. ఈ వేడుకకు వచ్చే వారికి ప్రత్యేక పాసు అందజేశారు. పెళ్లికొడుకు, పెళ్లికూతురు టి షర్ట్స్‌ ధరించి వచ్చారు. వివాహం తర్వాత గీత ఆమె బంధువు సమీపంలో ఉన్న రిసార్ట్‌లో చూరా చడాయ్‌ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెళ్లికూతురికి గాజుతో పాటు బంగారు కాలిరేన్‌ తొడుగుతారు. దీంతో వివాహం పూర్తయినట్లే. అన్నట్లు సచిన్‌ ఈ వేడుకకు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించాడు.