ఎమ్మెస్‌ రాజు భారీ బడ్జెట్‌ సినిమా

Posted On:29-10-2015
No.Of Views:287

బాహుబలి,రుద్రమదేవి హిట్టయ్యాక పెద్ద నిర్మాతల్లో కదలిక మొదలైంది. స్టార్‌ ప్రోడ్యూసర్‌ ఎంఎస్‌రాజు ఇప్పుడు భారీ బడ్జెట్‌ సినిమా తీసేందుకు సిద్ధమయ్యాడు. టాప్‌ స్టార్స్‌తో టాప్‌ సినిమా తీయానుకున్నట్లు ఇటీవ ప్రకటించారు. ఈ మధ్యనే ఆయన కుమారుడు సుమంత్‌ అశ్విన్‌ నటించిన కోంబస్‌ విడుదలైన సందర్భంగా ఎమ్మెస్‌ రాజు తన నిర్ణయాన్ని ప్రకటించారు. మరి ఈ  సినిమాలో సుమంత్‌ అశ్విన్‌ నటిస్తాడా లేదో ఆయన తేల్చి చెప్పలేదు. కొడుకును ప్రమోట్‌ చేసే పనిలో ఎమ్మెస్‌ రాజు ఉన్నట్లు టాలీవుడ్‌ టాక్‌.