పాపం నితిన్‌!

Posted On:02-01-2016
No.Of Views:354

అఖిల్‌ అక్కినేనితో ’అఖిల్‌‘ సినిమాను తీసిన నితిన్‌,సుధాకర్‌రెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నాగ్‌ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని భారీ బడ్జెట్‌తో తీసిన అఖిల్‌ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడటంతో నితిన్‌ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఈ మధ్యే ఫిల్మ్‌ఛాంబర్స్‌ వారు విధించిన నిబంధను కూడా నితిన్‌కు ఇబ్బందిగా మారాయి. మింగలేక, కక్కలేక అన్న పరిస్థితి. సినిమా ఫ్లాప్‌ అయినా నిర్మాత,డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన దాదాపు రూ.20 కోట్లు డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించాల్సి ఉంది. ఎగ్గొట్టాని చూస్తే భవిష్యత్తులో నితిన్‌ చిత్రాు విడుద కాకుండా ఫిల్మ్‌ ఛాంబర్‌ అడ్డుపుల్లేస్తుంది. దాంతో నితిన్‌కు మరిన్ని ఇక్కట్లు తప్పవు.  ఈ మధ్యనే నిర్మాత ఎమ్మెస్‌ రాజు ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు. ఆయన తీసిన పౌర్ణమి,ఆట అట్టర్‌ప్లాప్‌ కావడంతో డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించాల్సిన ఏడుకోట్ల రూపాయు ఇవ్వకుండా తప్పించుకుతతిరుగుతున్నారు. దాంతో ఫిల్మ్‌ఛాంబర్‌,ఎమ్మెస్‌రాజుకు ఈ మొత్తం చెల్లించకపోతే, కొత్త సినిమాు రిలీజ్‌ చేయమని శ్రీముఖం పంపింది. దానికి తలొగ్గి ఆ మొత్తాన్ని చెల్లించి చేతు దుకున్నారు ఎమ్మెస్‌రాజు. మరి అఖిల్‌ నిర్మాతలైన తండ్రీ కొడుకు నితిన్‌,సుధాకర్‌రెడ్డి కింకర్తవ్యం ఏమిటి? అసలే పదికోట్ల మేరకు అప్పు తెచ్చి మరీ సినిమా తీశారు. మరో పది కోట్లు చేతు మీదుగా ఖర్చు పెట్టారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు 20 కోట్లు చెల్లించాలి ఏలా అని తండ్రీకొడుకు తబట్టుక్కూర్చున్నారు. అయితే నిర్మాత నష్టపోతే ఆదుకోవాల్సిన అక్కినేని ఫ్యామిలీ మాత్రం నోరు మెదపడం లేదు.