షారూఖ్‌ఖాన్‌ రిటైర్మెంట్‌?

Posted On:02-01-2016
No.Of Views:310

యాభై ఏళ్ల వయస్సులో షారూఖ్‌ రిటైర్మెంట్‌ ఏమిటని అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారా? అవున్నిజమే. షారూఖ్‌ఖాన్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అక్కడే ఉంది అసు కిటుకు. ఎప్పుడైతే తన నటనకు జాతీయ అవార్డు భిస్తుందో అప్పుడే రిటైర్మెంట్‌ అవుతానని ప్రకటించాడు. 200 కోట్ల క్లబ్‌లో చేరిన షారూఖ్‌ కొత్త సినిమా దిల్‌వాలే ఇప్పటి వరకు 150 కోట్లు క్లొగొట్టింది. అప్రతిహతంగా వసూళ్లను సాధిస్తూ బాజీరావు మస్తానీ సినిమాను దాటేసింది. ఇలాంటి స్థితిలో సూపర్‌స్టార్‌ షారూఖ్‌ రిటైర్మెంట్‌ నిర్ణయమేమిటా అని సినీజీవు నోళ్లు నొక్కుకున్నారు. అన్నీ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో సినిమా తీసే షారూఖ్‌కు జాతీయ ఉత్తమ పురస్కారం ఎప్పుడొస్తుందని కొందరంటే, ఇన్ని సినిమాు తీసిన తర్వాత జాతీయ పురస్కారం రాలేదన్న బెంగ ఉందని కొందంటున్నారు.